లోకేశ్‌తో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటి

మేకపాటి టిడిపి లో చేరే అవకాశం

mekapati-chandra-sekhar-reddy-met-nara-lokesh

అమరావతిః ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. గత ఎన్నికలో వైఎస్‌ఆర్‌సిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టిడిపి వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా టిడిపి యువనేత నారా లోకేశ్ తో వైఎస్‌ఆర్‌సిపి బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. కడప జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను మేకపాటి ఈరోజు కలిశారు. లోకేశ్ పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సిపి బహిష్కృత నేతలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా టిడిపిలో చేరబోతున్నారు.