బోరు ఫెయిల్ అయితే రైతు ఏం చేయాలి?

బోరు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా?..దేవినేని

devineni uma
devineni uma

అమరావతి: ఓసారి బోరు వేస్తే ఉచితంగా మరో బోరు వేయడం కుదరదంటూ ఏపి ప్రభుత్వం పెట్టిన మెలికతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ప్రతిరైతుకి బోరు అని పథకంలో చెప్పి ఒకసారి వేస్తే ఉచితంలేదని మెలిక పెట్టారు, బోరు ఫెయిల్ అయితే రైతు ఏం చేయాలి? బోరు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా? అర్హత ఉన్నా 1,100 గ్రామాలను ఎందుకు విస్మరించారు? మీ హయాంలో రైతులకు జలకళ తప్పిన మాట వాస్తవం కాదా? చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమా ప్రశ్నించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/