నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గూడూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. రైల్‌లోని ప్యాంట్రీ కార్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు రైలును గూడూరు రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక, రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బోగీ సగం కాలిపోయింది.

అగ్నిప్రమాదం కారణంగా సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన చెన్నై కు సమాచారం ఇచ్చారు.. రైల్వే అధికారులు ఆ బోగీని పరిశీలించిన తర్వాత రైలు చెన్నై వైపు వెళ్లింది. గూడూరు స్టేషన్ సమీపంలో జరగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని.. అదే స్టేషన్, స్టేషన్ మధ్యలో జరిగి ఉంటే మిగిలిన బోగీలకు మంటలు వ్యాపించేవి అంటున్నారు.