సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రధాని నరేంద్రమోడి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. అయితే ఈ ప్ర‌సంగానికి సంబంధించి పూర్తి స‌మాచారం ఇంకా తెలియ‌దు. దేశ ప్ర‌జ‌ల‌కు తానో విష‌యం చెప్ప‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోడి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. అయితే ఆ ప్ర‌సంగాన్ని అంద‌రూ ఆల‌కించాల‌న్నారు. ఏ అంశంపై ప్ర‌ధాని మోడి మాట్లాడుతారో దాని గురించి ఆ ట్వీట్‌లో వెల్ల‌డించ‌లేదు. కాగా మార్చిలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి ప‌లు మార్లు ప్ర‌ధాని మోడి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన విష‌యం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/