కేంద్ర ఆదేశాలపై స్పందించిన ట్విటర్‌

కొన్ని ఖాతాలను రద్ద చేయలేం..ట్విటర్‌

న్యూఢిల్లీ: ట్విటర్‌ భారత ప్ర‌భుత్వ ఆదేశాలను పాక్షికంగా అమ‌లు చేసింది. రైతుల ఆందోళ‌న‌ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న పాకిస్థాన్‌, ఖ‌లిస్తాన్‌కు చెందిన 1178 ట్విట‌ర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ప్ర‌భుత్వం ఆదేశించగా.. ట్విట‌ర్ మాత్రం వాటిలో కొన్నింటినే బ్లాక్ చేసిన‌ట్లు బుధ‌వారం వెల్ల‌డించింది. అది కూడా కేవ‌లం ఇండియా వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని, ఇత‌ర దేశాల్లో ఆ అకౌంట్లు ప‌ని చేస్తాయ‌ని తెలిపింది.

ఇక తాము మీడియా, జ‌ర్న‌లిస్టులు, ఉద్య‌మ‌కారులు, రాజ‌కీయ నాయ‌కుల ఖాతాల జోలికి వెళ్ల‌లేద‌ని, అది భార‌త చ‌ట్టాల ప్ర‌కారం భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ట్విట‌ర్ స్ప‌ష్టం చేసింది. గ‌ళాలు స్వేచ్ఛ‌గా త‌మ వాద‌న వినిపించ‌డానికి త‌మ మైక్రోబ్లాగింగ్ ఉన్న‌ద‌ని, ఎవ‌రైనా ఎలాంటి అభిప్రాయాలైనా వ్య‌క్తం చేసేలా తాము మ‌రింత మెరుగైన సేవ‌లు అందిస్తామ‌ని తెలిపింది.