మైనార్టీలపై చైనా క్రూర‌త్వం..ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక

UN cites possible crimes vs. humanity in China’s Xinjiang

జెనీవాః చైనా తమ దేశంలోని మైనార్జీలపై మరణహొమానికి పాల్ప‌డిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి త‌న నివేదిక‌లో ఆరోపించింది. జిన్‌జియాంగ్ ప్రావిన్సులో ఉయిగ‌ర్ ముస్లింల‌పై ఆ దేశం ఊచ‌కోత‌కు దిగిన‌ట్లు యూఎన్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. ఉయిగ‌ర్ ముస్లింల‌తో పాటు ఇత‌ర మైనార్టీల‌పై డ్రాగ‌న్ హింస‌కు దిగిన‌ట్లు యూఎన్ తెలిపింది. ఆ రిపోర్ట్‌ను చైనా ఖండించింది. పాశ్చాత్య దేశాలు త‌ప్పుడు నివేదిక‌ను రూపొందించిన‌ట్లు చైనా విమ‌ర్శించింది. ఉయిగ‌ర్ ముస్లింల‌ను చిత్ర‌హింస పెట్టిన అంశానికి సంబంధించిన విశ్వ‌స‌నీయ‌మైన ఆధారాల‌ను గుర్తించామ‌ని, ఇది మాన‌వ‌త్వానికి జ‌రిగిన హింస అని యూఎన్ త‌న రిపోర్ట్‌లో చెప్పింది. మైనార్టీల హ‌క్కుల్ని కాలరాసేందుకు జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాల‌ను చైనా వాడుకున్న‌ట్లు ఆరోపించింది. యూఎన్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల హై క‌మీష‌న‌ర్ ఈ నివేదిక‌ను త‌యారు చేశారు. ఖైదీల‌ను చాలా నీచంగా చూశార‌ని, లైంగిక వేధింపులు కూడా జ‌రిగిన‌ట్లు యూఎన్ త‌న రిపోర్ట్‌లో ఆరోపించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/