మాగుంట రాఘవ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను స్పెషల్‌ కోర్టు పొడిగించింది. మార్చి 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. శనివారం నాటికి జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో సీబీఐ అధికారులు రాఘవను మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు.

ఈ మేరకు మార్చి 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ ఉత్తర్వులిచ్చారు.. సౌత్‌గ్రూప్‌లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు విచారణలో నిర్ధారించిన ఈడీ అధికారులు ఆపై అతనిని అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుని మాగుంటను విచారించింది. విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్డడీకి తరలించారు. తాజాగా జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతోనే మరో 11 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.