హిందూపురంలో బాల‌కృష్ణ‌ పర్యటన

ఈ రెండేళ్లలో ఏయే అభివృద్ధి ప‌నులు చేశారు?..వైస్సార్సీపీ పై మండిప‌డ్డ నంద‌మూరి


హిందూపురం: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఉదయం హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయ‌న వైస్సార్సీపీ ప్రభుత్వ పాల‌న‌పై మండిప‌డ్డారు. రాష్ట్రంలో వైస్సార్సీపీ స‌ర్కారు వ్య‌వస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఏపీలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని చెప్పారు. కొంద‌రు వైస్సార్సీపీ నేత‌లు తనను విమర్శిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వారు అధికారంలో ఉన్న‌ ఈ రెండేళ్లలో ఏయే అభివృద్ధి ప‌నులు చేశారన్న విష‌యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇలాగే ప్ర‌భుత్వం బెదిరింపులకు పాల్పడితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయ‌న హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని విభాగాలను ప్రైవేటు పరం చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు.

తాజా అంతర్జాతీయ కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/