నేడు తూర్పుగోదావరి జిలాల్లో పర్యటించనున్న సిఎం జగన్‌

CM Jagan will tour East Godavari districts today

అమరావతిః సిఎం జగన్‌ నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లామండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆస్సాగో ఇండస్ట్రియల్ సంస్థ 280 కోట్లతో 200 కె.ఎల్.పీ.డి సామర్ధ్యం గల బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. భూమి పూజ కార్యక్రమం అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం జగన్.సీఎం పర్యటన సందర్భంగా గోకవరం పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్ మళ్ళించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు…ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గోకవరం మండలం పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.

రాష్ట్రంలోనే మొదటిసారిగా పెద్ద పరిశ్రమ రానునడడంతో నియోజకవర్గ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. గోకవరం మెట్ట ప్రాంతం ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యక్షగాను పరోక్షంగాను ఇటు రైతులకు ,నిరుద్యోగ యువతకు ఈ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు స్థానిక వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యే చంటిబాబు…జీరో లిక్విడ్ ఇధనాయిల్ డిశ్చార్జ్ వేస్ట్ వల్ల ఎలాంటి అపాయం ఉండదు అంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/