పాలకూర పలావ్

రుచి : వెరైటీ వంటకాలు

కావల్సినవి:

పాలకూర-300 గ్రాములు, రైస్ -కప్పు, ఉప్పు -తగినంత, చిన్న టమాటో-1, పల్లీలు -అరకప్పు (పొడి చేసుకోవాలి), నూనె- సరిపడా, పసుపు- చిటికెడు, నీళ్లు – సరిపడా…

తయారు చేసే విధానం:

ముందుగా పాలకూర ఆకులను కడిగి, ముక్కలుగా తరిగి దోరగా వేగించి పెట్టుకోవాలి.. చల్లారాక మిక్సీ లో వేసి, టమాటో తో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.. తరువాత అన్నం వండి , కడాయిలోకి తీసుకోవాలి.. అందులో పాలకూర , టమాటో పేస్ట్ , ఉప్పు వేసి పొయ్యి మీద ఉడికిస్తూ బాగా కలపాలి.. అంతే పాల కూర పలావ్ రెడీ..పల్లీ పొడి , కూర లేదా రైస్ తో తింటే రుచిగా ఉంటుంది.

‘నాడి’ (ఆరోగ్య సంబంధిత విషయాల కోసం) క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health1/