హుందాగా నైట్‌డ్రెస్‌లు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

ladies fashion wear-night dresses
ladies fashion wear-night dresses

పేరుకే అవి నైట్‌డ్రెస్సులు కానీ ఎక్కువసేపు వేసుకేనేది వాటినే మరి. దీనికి పెద్దా ఆడమగా తేడా లేదు. ఒంటికి హాయిగా సౌకర్యంగా ఉంటాయన్న కారణంతో ఇంట్లో ఉన్నంతసేపూ అవే వేసుకుంటున్నారు.

వాటితోనే అన్ని పనులూ చేస్తున్నారు. దాంతో ఆఫీసులకు పార్టీలకీ వేసుకునే డ్రెస్సులతో పోలిస్తే ఇవి త్వరగా ఫేడ్‌ అయిపోతాయి.

అయినా ఎంత ఇంట్లో ఉంటేమాత్రం ఎప్పుడూ పాతబడినవో ఒకేలాంటివో వేసుకుని తిరుగుతుంటే ఏం బాగుంటుంది అన్న విషయాన్ని బాగా గుర్తించింది నేటితరం.

అందుకే అవి కూడా కొత్తగా ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటోంది.

దానికి తగ్గట్లే వాటిని ఎప్పటికప్పుడు సరికొత్తగా డిజైన్‌ చేస్తున్నారు డిజైన్లు. అదీగాక, ఒకప్పుడు నైట్‌వేర్‌ అనేది పడకగదికే పరిమితం.

క్రమంగా అది పడకగది దాటి హాల్లోకి వంటింట్లోకి ప్రవేశించి హోమ్లీవేర్‌గా మారిపోయింది. అప్పుడప్పుడూ దానితోనే బయటకు అంటే జిమ్‌కో వాకింగుకో యోగకో వెళ్లడమూ మొదైంది.

ladies fashion wear-night dresses-

దాంతో నైట్‌డ్రెస్సునీ దాదాపు ఫార్మల్‌ వేర్‌లానే డిజైన్‌ చేస్తున్నారు. అంతేకాదు, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లతో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏడాదిలో సగం రోజులు ఇంటికే పరిమితమవుతున్నారు.

అందువల్లా నైట్‌కమ్‌ హోమ్‌ వేర్‌ రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది.

ladies fashion wear-night dresses–

పైగా స్టైల్‌ ఏదయినాగానీ కాలానికి తగ్గట్టుగా అంటే వేసవికి కాటన్‌, చేనేత ఫ్యాబ్రిక్కుతో హాయిగా గాలాడేలా, చలికాలంలో రేయాన్‌, ఊలు, వెల్వెట్‌ క్లాత్‌తో వెచ్చగా ఉండేలా, వర్షాకాలంలో త్వరగా ఆరిపోయేలా సిల్కు, నైలాన్‌, శాటిన్‌ ఫ్యాబ్రిక్కులతో డిజైన్‌ చేయడం వల్లా నైట్‌వేర్‌ వాడకం ఎక్కువవుతోంది.

రెండుమూడు దశాబ్దాల క్రితం దక్షిణాదిన పెళ్లయిన మగవాళ్లయినా టీనేజీ కుర్రాళ్లయినా ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యంగా ఉండేందుకు లుంగీ కట్టుకునేవారు.

కొందరు మాత్రం నిక్కర్లో పైజామా ప్యాంట్లో వేసుకునేవారు.

ఆడవాళ్లయితే పాతచీరల్నే ఇంట్లో కట్టుకునేవారు. ఉత్తరాదిన మాత్రం ఆడామగా అంతా లాల్చీపైజమానే ధరించేవారు.

నిజానికి మొఘల్స్‌ నుంచి వచ్చిన ఈ పైజమాని బ్రిటిషర్లు సైతం సొంతం చేసుకున్నారు. దాంతో ఒక దశలో ప్రపంచవ్యాప్తంగా నైట్‌వేర్‌ అంటే పైజమాగానే స్థిరపడిపోయింది.

కానీ మన పైజమాల్ని వాళ్లు తీసుకుని, వాళ్ల నైట్‌గౌన్ల సోకుని ముఖ్యంగా మన ఆడవాళ్లకి అంటించి పోయారు బ్రిటిషర్లు.

కానీ మన పైజామాల్ని వాళ్లు తీసుకుని, వాళ్ల నైట్‌గౌన్ల సోకుని ముఖ్యంగా మన ఆడవాళ్లకి అంటించిపోయారు బ్రిటిషర్లు.

దాని ఫలితమే నైటీలు. వీటిల్లోని సౌకర్యం తెలిశాక చాలామంది పగలూ రాత్రీ కూడా ఇంట్లో ఉన్నంతసేపూ అవే వేసుకోవడం ప్రారంభించారు. క్రమంగా ఉత్తరాది చుడీదార్‌లూ సల్వార్లూ దక్షిణాది దుస్తుల్లోనూ భాగంగా మారాయి.

ladies fashion wear-night dresses-

దాంతో నైటీతోబాటు కుర్తాపైజామా కూడా అమ్మాయిల నైట్‌వేర్‌లో భాగంగా మారింది. ఫ్యాషన్లు అక్కడితో ఆగిపోతే చెప్పునేదేముంటుంది.

చుడీదార్లూ సల్వార్లు స్థానంలో లెగ్గింగులూ జెగ్గింగులూ జీన్సు ప్యాంట్లూ వచ్చాయి.

వాటితోబాటే నైట్‌వేర్‌లోనూ సుతిమెత్తని బనీను మెటీరియల్‌తో తయారైన ప్యాంటూషర్టు లొచ్చేశాయి.

వాటిల్లోనే ఇప్పుడు తాజా ట్రెండ్‌ని అనుసరిస్తూ భార్యాభర్తలకీ పిల్లలకీ మొత్తం కుటుంబానికీ కలిపి మ్యాచింగ్‌ సెట్లూ వస్తున్నాయి.

ఇక, వీటిల్లో డిజైన్లూ రంఉగలయితే లెక్కే లేదు. ఈ నైట్‌ సూట్సులోనే పుల్‌లెన్త్‌ ప్యాంట్లూ, క్యాప్రీల్లా త్రీఫోర్త్‌ ఉండేవీ, పొడవూ పొట్టీ షార్ట్సు..వంటి రకాలెన్నో.

షర్లు డిజైన్‌లోనూ ప్యాంటు కట్స్‌లోనూ బోలెడు స్టైల్స్‌. టీషర్టుల్లోలానే నైట్‌షరుట్లఓ్లనూ స్లీవ్‌లెస్‌, షార్టస్లీవ్స్‌, లాంగ్‌స్లీవ్స్‌ వంటి వెరైటీలు కోకొల్లలు..

ladies fashion wear-night dresses-

వీటిల్లోనే కొత్తగా త్రీ, ఫోర్‌, ఫైవ్‌పీస్‌ సెట్లూ ఉంటున్నాయి. ఫైవ్‌పీస్‌ సెట్టు ఒకటి ఉంటే వరసగా మూడురోజులపాటు ఒక్కో రకంగా వేసుకోవచ్చన్నమాట.

ఈ సెట్స్‌లో కొన్ని ప్యాంట్లూ నిక్కర్లతో ఉంటే, మరికొన్నింటిలో ఫ్రాక మోడల్‌ కూడా ఉంటుంది.

నైట్‌సూట్స్‌తో పోలిస్తే ఈ తరం అమ్మాయిల్లో నైటీ వేసుకోవడం తక్కువే చెప్పాలి. అందుకే వాళ్లకోసం ఆ నైటీ కొంచెంకొంచెంగా పొట్టిదై మోకాళ్ల పైకి వేసుకునే గౌనులా మారిపోయింది.

ఈ పొట్టిగౌనుల్లో కూడా లాంగ్‌ టీషర్టూ, ఫ్రాకూ, పొడవుకుర్తా వంటి రకాలెన్నో ఉంటున్నాయి.

అలాగే పైజమా ఫ్యాషన్‌నీ పూర్తిగా వదలకుండా వాటిల్లోనూ ఎప్పటికప్పుడు హ్యాండ్‌లూమ్‌, బ్లాక్‌ప్రింట్స్‌తో వస్తోన్న కొత్త డిజైన్లనీ స్వాగతిస్తున్నారు

ఈనాటి అమ్మాయిలు. అంతేకాదు, ఈమధ్య కాలంలో ఆడవాళ్ల మనసు దోచుకున్న ధోబీ, పాటియాలా ప్యాంట్లూ నైట్‌సూటుల్లోకి చొరబడ్డాయి.

పొట్టి కుర్తాతో వస్తున్న ఈ డ్రెస్సుతో ఇంట్లోనే కాదు బయటా హ్యాపీగా తిరగేయొచ్చు మరి.

ఇవేనా జంప్స్‌ బేబీ డాల్‌ ఫ్రాకులూ ఇలా ముద్దొచ్చే మోడల్స్‌ ఎన్నో నైట్‌డ్రస్సు సీను మారుతోంది అనేది అందుకే మరి.

తాజా ‘మొగ్గ ‘(చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/