పిల్లలకు జ్వరం వస్తే..!

చిన్నారుల ఆరోగ్య సంరక్షణ

child has a fever
child has a fever

పిల్లలకు జ్వరం అనేది సాధారణంగా వస్తుంటుంది. జ్వరం వచ్చినప్పుడు పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనడం కూడా సహజం.

అయితే ఎలాంటి జ్వరాలకు ఆందోళన చెందాలి, అసలు శరీర ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలుంటే దాన్ని జ్వరం అనుకోవాలి వంటి విషయాలు తల్లిదండ్రులు తెలుసుకుంటే కంగారుపడకుండా జాగ్రత్తగా ఉండేందుకు వీలవుతుంది. ఒక్కోసారి ఎండవేడికి కూడా పిల్లల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది.

బాగా ఆటలాడి అలసిపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంటుంది కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు పిల్లల్లో జ్వరాలు, వాటి లక్షణాలు తెలుసుకుందాం.

ఎక్కువగా పిల్లలకు మలేరియా జ్వరాలు వస్తుంటాయి. ఇంకా వైరల్‌ సంబంధమైన చికున్‌గున్యా, డెంగ్యూ, ఫీవర్లు వస్తుంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఒక్కోసారి ఫిట్స్‌ కూడా వస్తుంటాయి.

జ్వరం రావడంతోనే ఫిట్స్‌ వస్తాయేమోనని ఆందోళన చెందుతుంటారు. యాంటి బయాటిక్స్‌ ఇవ్వక పోవడమే ఇందుకు కారణం అంటుంటారు.

కానీ జ్వరం అనేది శరీరస్పందన. దానికి ఫిట్స్‌తో సంబంధం ఉండదంటున్నారు పిల్లల వైద్యనిపుణులు.

18ఏళ్లు దాటిన పిల్లల్లో సాధారణ ఉష్ణోగ్రత 98.6 ఫారన్‌హీట్‌ ఉంటుంది. తెల్లవారుజాము మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు తక్కువ టెంపరేచర్‌ ఉంటుంది.

జీవప్రక్రియ వల్ల అలా ఉంటుంది. రెండేళ్లలోపు 50శాతం మంది పిల్లల్లో జ్వరం లేకుండానే వారి ఉష్ణోగ్రత వంద డిగ్రీల వరకు ఉంటుంది. వంద డిగ్రీల వేడి ఉందని తల్లితండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్లు.

జ్వరం వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి?

పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే ఆందోళన పడకూడదు.మెదడులోని హైపోతలమస్‌లో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం ఉంటుంది.

ఐదేళ్లలోపు పిల్లల వరకు ఈ కేంద్రానికి సరైన నియంత్రణ శక్తి ఉండదు. అందువల్ల ఒక్కోసారి ఎక్కువ జ్వరం వస్తున్నట్లు కనిపిస్తుంది. జ్వరం రాగానే ఎందుకు జ్వరం వచ్చిందనే విషయమై నిర్ధారణ చేసుకోవాలి.

ముందుగా మలేరియా జ్వరం వచ్చిందేమోనని భావించాలి. తెల్లరక్త కణాలు, ప్లేట్‌లెట్స్‌ తనిఖీ చేసుకోవడం ద్వారా యూరిన్‌ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ (యుటిఐ)ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.

మెదడులో జబ్బులు లేకపోయినా ఒక్కొక్కసారి పిల్లలకు 105, 106 డిగ్రీల వరకు కూడా జ్వరం వస్తుంటుంది.

సాధారణంగా పిల్లలకు వచ్చే జ్వరాల్లో వైరల్‌ సంబంధమైనవి, యుటిఐ వల్ల వచ్చేవి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/