మృదువైన చర్మం కోసం

అందమే ఆనందం

smooth skin
smooth skin

మన ముందు తరాల వారు సబ్బుని ఉపయోగించేవారు కాదు. దానికి బదులుగా నలుగుపిండి ఉపయోగించేవారు.

పెసరపిండి, శెనగపిండి, పసుపు కలిపి దీన్ని తయారుచేస్తారు.ఇది చర్మ రంధ్రాల్లోని మురికిని వదిలిస్తుంది. చర్మంపై చేరిన మృతకణానలు తొలగిస్తుంది.

దీనివల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు ప్రకాశంతంగా కనిపిస్తుంది. పైగా చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు సైతం తగ్గుముఖం పడతాయి.

పసుపు ముఖ వర్ఛస్సుని పెంపొందిస్తుంది. దీనిలో ఉన్న యాంటిబయోటిక్‌, యాంటిసెప్టిక్‌ గుణాల వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి.

పైగా చర్మం ఛాయ సైతం మెరుగుపడుతుంది. పసుపు శరీరం ఉన్న అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది. మన చిన్నతనంలో షాంపూకి బదులుగా తలస్నానానికి కుంకుడుకాలయను ఉపయోగించేవాళ్లం.

కొందరు శీకాయలను వాడేవారు. అయితే షాంపూల రాకతో వాటి వినియోగం కనుమరుగై పోయింది. కానీ తలను శుభ్రం చేసుకోవడానికి ఇప్పటిక కొంతమంది పెద్దవాళ్లు కుంకుడుకాయలను వాడుతుంటారు.

దీనివల్ల జుట్టుపై రసాయనాల ప్రభావం పడదు. అంతేకాదు తలస్నానం చేసేముందు కుదళ్లకు కొబ్బరినూనె బాగా పట్టించేవారు.

వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సైతం అంత త్వరగా తెల్లబడదు. జుట్టు రాలడమూ తగ్గుతుంది.

ఇప్పుడంటే మనం చర్మానికి మాయిశ్చరైజర్‌ రాసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు దాని కోసం తాజా వెన్నను ఉపయోగించేవారు.

దీనివల్ల చర్మం పాపాయి చర్మం అంత లేతగా మారిపోతుంది. పైగా ఒకసారి రాసుకుంటే ఆ రోజంతా చర్మం పొడిబారకుండా ఉంటుంది. పొడిబారిన, పగిలిన పెదాలను తిరిగి మామూలుగా మార్చడానికి మనం లిప్‌బామ్‌ ఉపయోగిస్తాం.

కాని ఆ రోజుల్లో వెన్నను ఉపయోగించేవారు దీనివల్ల పెదవులు అందంగా కనిపిస్తాయి. బయట దొరికే వెన్న కన్నా ఇంట్లో పెరుగు చిలికిన వెన్న ఎంతో తాజాగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/