నేడు చీమకుర్తిలో వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సిఎం జగన్‌

బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద బహిరంగసభలో ప్రసంగించనున్న సిఎం

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతిః సిఎం జగన్‌ ఈరోజు ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన కాసేపటి క్రితం పయనమయ్యారు. చీమకుర్తిలోని మెయిన్ రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మంటపం వద్ద దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పర్యటన సందర్భంగా స్థానిక నేతలతో జగన్ కాసేపు సమావేశమయ్యే అవకాశం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/