కేంద్రానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు..ఛానెల్పై నిషేదం ఎత్తివేత

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మలయాళ వార్తా ఛానెల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యూస్‌ ఛానెల్‌ టెలికాస్ట్‌ను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి మీడియా వన్ ఛానెల్ ను బ్యాన్ చేసింది. దాంతో ఆ ఛానెల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు ఇవాళ (ఏప్రిల్ 5) విచారణ చేపట్టింది.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరకంగా ఛానెల్‌ చేసిన ప్రసారాలను.. పత్రికా వ్యవస్థకు విరుద్ధమైనవిగా పరిగణించలేమని సుప్రీం అభిప్రాయపడి ఛానెల్ పై విధించిన బ్యాన్ ను తొలగించింది. పటిష్టమైన ప్రజాస్వామ్యాం కోసం స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరమని డివై చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియావన్ ఛానెల్‌పై జాతీయ భద్రతా వాదనలు లేవనెత్తినందుకు హోమ్‌ మంత్రిత్వశాఖను సుప్రీం నిలదీసింది.