మరో రెండు రోజుల పాటు తెలంగాణ లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల నుండి ఇప్పుడిప్పుడే జనాలు బయటకు వస్తుండగా..ఈరోజు శుక్రవారం ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షం ప‌డింది. ప‌లు చోట్ల జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. రోడ్ల‌పై వ‌ర‌ద నీరు పొంగిపొర్ల‌డంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

మ‌రో రెండు రోజుల పాటు కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప‌లు చోట్ల అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలుపడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మహబూబాబాద్ , నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, మెద‌క్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురియ‌నున్నాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

ఇక శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వ‌ర్షపాతం వివ‌రాలు..

దంతాల‌ప‌ల్లి(మ‌హ‌బూబాబాద్‌) – 20.3 సెం.మీ.
దేవ‌ర‌పుప్పుల మండ‌లం(జ‌న‌గామ‌) – 18 సెం.మీ.
నెల్లికుదురు మండ‌లం(మ‌హ‌బూబాబాద్) – 14.8 సెం.మీ.
కొమ్ముల‌వంచ‌(మ‌హ‌బూబాబాద్‌) – 14.3 సెం.మీ.
పెద్ద‌నాగారం(మ‌హ‌బూబాబాద్‌) – 14 సెం.మీ.
ముకుందాపురం(సూర్యాపేట‌) – 13.6 సెం.మీ.
తొర్రూర్ మండ‌లం(మ‌హ‌బూబాబాద్‌) – 12.5 సెం.మీ.

ప‌మ్మీ(ఖ‌మ్మం) – 11.8 సెం.మీ.
నాగుల‌వంచ‌(ఖ‌మ్మం) – 11.6 సెం.మీ.
ఆత్మ‌కూర్(సూర్యాపేట‌) – 11.6 సెం.మీ.
ఉర్లుగుండ‌(సూర్యాపేట‌) – 11.5 సెం.మీ.
గుండాల మండ‌లం(యాదాద్రి) – 11.4 సెం.మీ.
మేళ్ల‌చెరువు(సూర్యాపేట‌) – 11.2 సెం.మీ.
మామిళ్ల‌గూడెం(సూర్యాపేట‌) – 11 సెం.మీ.
న‌డిగూడెం(సూర్యాపేట‌) – 10 సెం.మీ.
మ‌రిపెడ మండ‌లం(సూర్యాపేట‌) – 10 సెం.మీ.