విశ్వక్ సేన్ తో రవితేజ మూవీ..?

మాస్ మహారాజా రవితేజ ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క తన సొంత నిర్మాణ సంస్థలోను ఇతర హీరోల తో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తాను హీరోగా తెరకెక్కిన సినిమాల్లో భాగస్వామి గా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ నటించిన రావణాసుర చిత్రానికి కూడా భాగస్వామి గా ఉన్నారు. ఏప్రిల్ 07 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంగానే తన సొంత నిర్మాణ సంస్థలో ఇతర హీరోలు పెట్టి సినిమాలు చేయాలనీ చూస్తున్నాడట. ఇప్పటికే పలు కథలు వినడం జరిగింది. అందులో ఓ కథ యంగ్ హేర్ విశ్వక్ సేన్ కు బాగా సెట్ అవుతుందని భావిస్తున్నారట. త్వరలోనే విశ్వక్ కు ఆ కథ వినిపించబోతున్నారని తెలుస్తుంది. మరోపక్క విశ్వక్ సైతం ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే..నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా దాస్ కా ధమ్కీ మూవీ చేసాడు. దీనికి హీరో, నిర్మాత, డైరెక్టర్ మూడు ఆయనే కావడం విశేషం. మరి రవితేజ నిర్మాణంలో సినిమా చేస్తాడా..లేదా అనేది అతి త్వరలో తెలియనుంది.