ఏపి హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః నేడు సుప్రీంకోర్టులో అమరావతి పై విచారణ జరిగింది. అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, నెల రోజుల్లో కొన్ని పనులు, మరో 6 నెలల్లో ఇంకొన్ని పనులు చేయాలన్న కాలపరిమితులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి వ్యవహారానికి సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జనవరి 31 లోపు తప్పనిసరిగా జవాబు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/