గుజరాత్‌లో ఈ దఫా ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయం

gujarat-me-aap-ki-sarkar-ban-rahi-hai-arvind-kejriwal-gives-in-writing

న్యూఢిల్లీః గుజరాత్‌లో ఈ దఫా ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సిఎం ఆరవింద్‌ కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు. సూరత్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్‌ ఫలితాలే గుజరాత్‌లోనూ పునరావృతం అవుతాయని అన్నారు. ఈ మేరకు గుజరాత్‌లో ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ ఓ కాగితంపై రాసి మరీ మీడియాకు చూపించారు.

‘రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధిస్తుంది. ఢిల్లీ, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందని నేను చెప్పా. అది నిజమైంది. గుజరాత్‌లోనూ అదే జరుగుతుంది. ఈ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కూడా చాలా ముఖ్యం. ఎన్నికల్లో మా పార్టీకి మద్దతివ్వాలని ప్రభుత్వ ఉద్యోగులకు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలో ఆప్‌ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. వచ్చే ఏడాది జనవరి 31 నుంచే పాత పింఛను పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తాం’ అని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/