మోడీ అసత్యాలు ప్రచారం చేసే నేత : మల్లికార్జున్ ఖర్గే

అహ్మదాబాద్‌ః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నర్మదా జిల్లాలోని దెదిపదలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ సానుభూతి పొందేందుకు పేదవాడినని చెబుతారని, అయితే తాను అంటరానివారిలో ఒకడినని ఖర్గే అన్నారు. ప్రధాని మోడీ అసత్యాలు ప్రచారం చేసే నేతని ఆయన మండిపడ్డారు. నర్మదా జిల్లాలోని దెదిపదలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. తాను అంటరాని కులానికి చెందిన వాడినని ఖర్గే చెప్పుకొచ్చారు. మోడీ మాత్రం ప్రజల్లో సానుభూతి కోసం పేదవాడనని ప్రచారం చేసుకుంటారని కానీ ప్రజలు తెలివైనవారని..ఎన్నిసార్లు మీరు అబద్దాలు చెబుతారని మోడీని ఖర్గే నిలదీశారు.
ఇక 182 మంది సభ్యులు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో పాలక బిజెపి మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా ఎలాగైనా బిజెపిని మట్టికరిపించాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక పంజాబ్‌లో విజయంతో ఊపుమీదున్న ఆప్ గుజరాత్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/