చిల్లర రాజకీయాలు ఆపండి

లేదంటే ప్రజలు తిరగబడతారు: పవన్‌ కళ్యాణ్‌

pawankalyan
pawankalyan

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న తప్పులను వేలెత్తి చూపిస్తున్న వారిపై అధికార పార్టి పెద్దలు బురద జల్లే కార్యాక్రమాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్‌ కిట్ల విషయంలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అధికార పార్టి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ వాగ్వాదం జరుగుతుంది. ఇదే సమయంలో కన్నాపై వైసిపి నేతలు అందరు విరుచుకు పడుతున్నారు. కన్నాపై జరుగుతున్న దాడి ప్రజాస్వామ్యా వాదులు ఖండించాల్సిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడగాల్సిన స్ధాయిలో ఉందని అన్నారు.

ఒకవైపు కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్దిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అగ్రదేశాలు సైతం వైద్య సేవలు అందించలేక అవస్థలు పడుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో కూడా లక్షలాది కార్మికులు ఊరుకాని ఊర్లో ఉంటు ఆకలితో అమటిస్తున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారిగా పెరుగున్నాయి. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉందని ఇలాంటి సమయంలో కరోనా పై దృష్టి సారించాలి కాని ప్రతిపక్ష పార్టీల నాయకులపై బురదజల్లే కార్యాక్రమాలు చేయడం సరికాదని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులలో జనసేన ఒకటే కోరుతోందని .. రాష్ట్రాన్ని, దేశాన్ని ఈ కరోనా రక్కసి వదిలి పోయే వరకు ఈ చిల్లర రాజకీయలు మానుకోవాలని, ప్రజల రక్షణపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలు కూడా రాజకీయాలను గమనిస్తున్నారని, ఈ చిల్లర రాజకీయలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/