మహిళా సంఘాలకు శుభవార్త

వైయస్‌స్సార్‌సిపి సున్నా వడ్డీ పథకం కింద రూ.1400 కోట్లు విడుదల చేయనున్న ఏపి ప్రభుత్వం

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపిలో మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైయస్‌స్సార్‌సిపి సున్నా వడ్డీ పథకం కింద రూ.1400 కోట్లను డ్వాక్రా సంఘాల ఖాతాల్లో వేయాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలోని 8.78 లక్షల డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న సుమారు 90 లక్ష్ల మందికి పైగా మహిళలకు లభ్ది చేకూరనుంది. ఈ నిధులను ఈ నెల 24 తేదిన విడుదల చేయనున్నట్లు తెలిసింది. అలాగే రాష్రంలోని 11.50 లక్షలమంది పేద విద్యార్ధులకు ప్రయోజనం కలిగించేందుకు పూర్తి ఫీజురీఎంబర్స్‌మెంట్‌ ను కూడా చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని తల్లుల ఖాతాలో వేయనున్నారని ప్రభుత్వం తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/