త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాః సినీ నటుడు సుమన్

తెలంగాణలో తన మద్దతు బిఆర్ఎస్‌కేనని స్పష్టీకరణ

actor-suman-said-that-he-will-entering-into-politics

మొగల్తూరు: ప్రముఖ సినీ నటుడు సుమన్ తాను రాజకీయాల్లోకి రానున్నట్లు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుమన్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు చెప్పారు. తెలంగాణలో తన మద్దతు బిఆర్ఎస్‌కే ఉంటుందని తేల్చి చెప్పారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందన్న సుమన్.. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. వర్షాలు, విపత్తులు ప్రతి సంవత్సరం వస్తుంటాయని, కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాగా, ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. అయితే, రజనీకాంత్ వ్యాఖ్యల్లో తప్పు లేదని సుమన్ సమర్థించారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ప్రశంసించారు. హైదరాబాద్‌ను ఓ స్థాయికి తీసుకువచ్చింది బాబేనన్నారు. ఆధునిక హైదరాబాద్ నగర నిర్మాణంలో ముఖ్య శిల్పి చంద్రబాబేనని సుమన్ కొనియాడారు.