ఆయన బాగుండాలని కోరుకుంటున్నా

కిమ్ జాంగ్ ఉన్  తో నాకు సత్సంబంధాలే ఉన్నాయి..ట్రంప్

Trump and Kim Jong Un
Trump and Kim Jong Un

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ఆరోగ్య పరిస్థితి క్షిణించినట్లు వస్తున్న కథనాలపై స్పందించారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో కిమ్ ను గుర్తు చేసుకున్న ట్రంప్, ‘ప్రస్తుతానికి నేను ఒక్కటే చెప్పగలను. ఆయన బాగుండాలి. అతనితో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వస్తున్న కథనాలపై ప్రకారమైతే, ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా విషమించినట్టేనని భావించాలి’ అని అన్నారు. ఇక కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యక్ష సమాచారం ఏమైనా లభించిందా? అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానాన్ని ఇవ్వలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/