ర్యాలీలు, సభలపై నిషేధం విధించడంపై జగన్ కు లేఖ రాసిన జనసేనాధినేత

ఏపీలో తాజాగా జగన్ సర్కార్ ఓ జీవో తీసుకొచ్చింది. ఎలాంటి సభలు , ర్యాలీ లు చేపట్టొదని , ఒకవేళ చేపడితే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని..వారు చెప్పిన చోటే మీరు సభలు , ర్యాలీ చేపట్టాలని ఓ జీవో తీసుకొచ్చింది. ఈ జీవో కారణంగా ఈరోజు చంద్రబాబు కుప్పం పర్యటన ను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో త్వరలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర తో పాటు పలు జిల్లాలో పలు సభలు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ జీవో కారణంగా ఆయన సభలకు , ర్యాలీలకు పోలీసులు అనుమతి ఎవ్వరు. అందుకే ఈ జీవో ఫై పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు లేఖ రాసారు.

ఓదార్పు యాత్ర పేరుతో మీరు దశాబ్ద కాలం పాటు యాత్రలు, రోడ్ షోలు చేయవచ్చు కానీ… ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు జనాల్లో తిరగొద్దా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు జనాల్లో తిరగడానికి అనుమతించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మీరు అధికారంలో లేనప్పుడు ఒక రూలు, అధికారంలోకి వచ్చాక మరో రూలా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా పింఛన్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ బహిరంగలేఖ రాశారు. ఆ లేఖలో ఏమని పవన్ ప్రశ్నించారు మీరే చూడండి,