మరోసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్ల దాడి

stone-pelted-at-gorakhpur lucknow-vande-bharat-express-in-up

లక్నో: మరోసారి రాళ్లు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రువ్విన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గొరఖ్‌పూర్-లక్నో సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారంనాడు రాళ్లు విసిరారు. 550 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ రైలు శనివారం మినహా వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తుంది.

రాళ్లు రువ్విన ఘటనలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నెంబర్ C1, C3 ఎగ్జిక్యూటివ్ కోచ్ అద్దాలు పగిలాయి. అయితే, ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. గతంలోనూ పలు రూట్లలో ఏడుసార్లు ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. జూలై 5న కర్ణాటకలోని చిక్కమగళూరులోని కదూర్-బీరూర్ మధ్య బెంగళూరు-ధార్వాడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై అగంతకులు రాళ్లు రువ్వారు. C5 కోచ్ నెంబర్ 43, 44, EC-1 కోచ్ టాయిలెట్‍పై రాళ్లు రువ్వడంతో ఔటర్ గ్లాసులు దెబ్బతిన్నాయి. ఎవరూ గాయపడలేదు.