కుప్పకూలిన నేపాల్ హెలికాప్టర్..ఆరుగురు మృతి

Nepal helicopter .. 6 people, including five Mexicans die; wreckage recovered

ఖాట్మండు : నేపాల్‌లో హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదంగా మారింది. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఉద‌యం 10:04 గంట‌ల‌కు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 10 :13 గంట‌ల‌కు అదృశ్య‌మైంది. దీంతో త్రిభువ‌న్ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మైంది. అనంత‌రం మ‌రో చాప‌ర్ ద్వారా అదృశ్య‌మైన హెలికాప్ట‌ర్‌ను గాలించ‌గా, లామ్జురా పాస్ వ‌ద్ద కొండ‌ల్లో హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన‌ట్లు గుర్తించారు. దీంతో పైల‌ట్‌తో పాటు ఐదుగురు మెక్సిక‌న్లు ప్రాణాలు కోల్పోయారు. కుప్ప‌కూలిన‌ చాప‌ర్‌ను మ‌నాంగ్ ఎయిర్ హెలికాప్ట‌ర్‌గా అధికారులు నిర్ధారించారు.

మృతుల‌ను మెక్సికోకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వార‌ని అధికారులు తెలిపారు. జీ ఫెర్నాడో(95), రిన్‌కాన్ ఇస్మాయిల్(98), గోంగ‌లెజ్ అబ్రిల్(72), గోంగ‌లెజ్ ఓలాషియో లూజ్(65), మ‌రియా జెస్సీ(52) గా గుర్తించారు. వీరిలో ఇద్ద‌రు పురుషులు కాగా, మిగ‌తా వారు మ‌హిళ‌లు.