మందుబాబులు ఇది తప్పక తెలుసుకోండి

మందుబాబులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త. ఎల్లుండి (సోమవారం) మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఎల్లుండి మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 25వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ 6 ఉదయం గంటల వరకు మద్యం షాపులో మూసివేయాలని సైబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా… రహదారులపై గుంపులుగా తిరిగిన కేసులు పెడతామని సైబరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌ నగరంలో తిరిగే వాహనాలపై కానీ… ఇతర జనాలపై రంగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.