బ‌హ‌దూర్‌పురాలో భారీ అగ్నిప్ర‌మాదం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని బ‌హ‌దూర్‌పురాలో ఈరోజు ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు గోదాం అంత‌టా వ్యాపించాయి. దీంతో స్థానికులు అప్ర‌మ‌త్త‌మైన అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. ఈ గోదాం చుట్టుప‌క్క‌ల నివాసాలు ఉండ‌టంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు.. కానీ భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/