వైయస్సార్ ఘాట్ వద్ద కన్నీరు పెట్టుకున్న షర్మిల

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించారు. రేపటి నుంచి ప్రజా ప్రస్థానం పేరు తో తెలంగాణలో పాదయాత్ర చేపట్టబోతుంది షర్మిల. ఈ సందర్భాంగా తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు వైఎస్ షర్మిల.. ఆమె తో పాటు నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ టీపీ తెలంగాణ నేతలు, వైఎస్ కుటుంబ అభిమానులు ఉన్నారు. అయితే ఇడుపులపాయ తండ్రి వైఎస్ ఘాట్ వద్ద ప్రార్ధనల సమయంలో భావోద్వేగానికి గురైయ్యారు.

తన తల్లి ని పట్టుకొని షర్మిళ కన్నీటి పర్వతమయ్యారు. చేవెళ్ళలో రేపు ఉదయం 11 గంటలకు షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి యాత్ర సాగుతుంది. తొలి రోజు చేవెళ్లలో సుమారు లక్ష మంది జనం పాల్గొనేలా జన సమీకరణ చేస్తున్నట్లు సమాచారం. రోజూ 10 నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ తయారు చేశారు.