ట్రంప్‌కు షాకిచ్చిన బైడెన్!

అమెరికాలో ఓట్ల లెక్కింపు -కొనసాగుతున్న ఉత్కంఠ!

Biden shock to Trump
Biden shock to Trump

 Washington: అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌లలో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలుసుకునేందుకు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

238 ఎలక్టోరల్ ఓట్లను పొంది గెలుపునకు దగ్గరగా ఉన్న జో బైడెన్, స్వింగ్ రాష్ట్రాల్లో అనూహ్యంగా పుంజుకున్నారు. ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేసే 12 స్వింగ్ రాష్ట్రాల్లో ఆరింట ఫలితం తేలిపోయింది

టెక్సాస్, ఒహియో, లోవా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ట్రంప్.. అరిజోనా, న్యూహాంప్‌షైర్ రాష్ట్రాల్లో జో బైడెన్ విజయం సాధించారు.

కౌంటింగ్ కొనసాగుతున్న  మిగిలిన ఆరు రాష్ట్రాల్లో నాలుగింట ట్రంప్ ఇప్పటి వరకు ఆధిక్యంలో కొనసాగారు.

అయితే ట్రంప్ ఇప్పటి వరకు ముందంజలో ఉన్న మిచిగాన్ రాష్ట్రంలో జో బైడెన్ అనూహ్యంగా పుంజుకున్నారు.

ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 94 శాతం ఓట్లను లెక్కించగా.. 49.4శాతం ఓట్లతో బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు.

ట్రంప్‌కు 49.1శాతం ఓట్లు లభించాయి. కాగా.. మిచిగాన్ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం..

మిచిగాన్, నెవెడా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో బైడెన్ ముందుంటే.. జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. 

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/