రాజకీయ కారణాలతోనే సిట్‌ వేశారు

వైఎస్‌ఆర్‌సిపి చర్యలతో భయపడేది లేదు

galla jayadev
galla jayadev

అమరావతి: చంద్రబాబునాయుడు ప్రభుత్వ నిర్ణయాలపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం సిట్‌ వేయడంపై ఎంపీ గల్లా జయదేవ్‌ స్పందించారు. టిడిపిపై బురదజల్లడమే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ చర్యలతో భయపడేమీలేదని స్పష్టం చేశారు. అమరవాతిలో ఇన్‌సైడ్‌ర్‌ ట్రేడింగ్‌ జరిగిందనడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతోనే సిట్‌ వేశారని ఎంపీ ఆరోపించారు. అమరావతి రాజధానిగా ఉండాలంటూ 67వ రోజు దీక్ష సందర్భంగా వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు ఎంపీ గల్లా జయదేవ్‌ మద్దతు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/