నేడు ఏపి రాజధాని గ్రామాల్లో బంద్‌

పిలుపునిచ్చిన అమరావతి జేఏసి

Bandh in AP Capital area
Bandh in AP Capital area

అమరావతి: నేడు ఏపి రాజధాని లోని పలు గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. మందడంలో పోలీసుల లాఠీ చార్జ్‌కు నిరసనగా రాజధాని గ్రామాల్లో అమరావతి జేఏసి బంద్‌కు పిలుపునిచ్చింది. వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది. మరోవైపు అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు 67వ రోజుకు చేరుకున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కిష్టాయిపాలెం, రాయవుడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/