కృష్ణా జిల్లాలో ఘోరం : బాలికపై సామూహిక అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని , ఒంటరి మహిళలను ..అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారని..ప్రభుత్వం దిశ చట్టం అనేది పూర్తిస్థాయిలో తీసుకరాలేకపోయిందని..పోలీసులన్నా , చట్టాలన్న కామాంధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ..రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం అనేది వెలుగులోకి వస్తూనే ఉంది.

తాజాగా కృష్ణా జిల్లాలోమైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మాయమాటలు చెప్పి బాలికను గొడ్ల సావిడికి తీసుకెళ్లిన నిందితుడు మరో ఇద్దరు యువకులతో కలిసి సామూహిక అత్యాచారం చేసాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను వెతికే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.