ఏ మార్గము?

శ్రీ షిర్డీసాయి దివ్య లీలలు

Shirdi-Sai-Baba
Shirdi-Sai-Baba

సాయిబాబా భక్తి మార్గమునే తన సందర్భకులకు, భక్తులకు తెల్పేవాడు. కర్మమార్గము, యోగ మార్గము, జ్ఞానమార్గములకు సాయిబాబా విశేష ప్రాధాన్యతనీయలేదు.

అందువలన సాయబాబాకు కేవలము భక్తి మార్గమే తెలియునా అనే సందేహం కలుగక మానదు. సాయిబాబా భక్తుల, సందర్శకుల వద్ద నుండి దక్షణను తీసుకునేవాడు.

సాయికి ధనము మీద అంతవాంచయున్నదా? అనిపించునట్లు చేయు వాడు. ఆ ధనమునంతయును అక్కడ ఉన్న వారికిచ్చే వాడు.

కొంతడబ్బుతో ఆహారం తయారు చేయాటానికి పదార్థాలను తెచ్చి, అన్నదానమును చేసేవాడు. ఆ ధనాన్ని సాయంకాలము తనవద్ద లేకుండా చేసుకునే వాడు. సాయిబాబా అలా కర్మలను చేసేవాడు.

కర్మలను చేసేవానికి దాపరికములేదు. సాయిజీవితమును ద్వారములు, కిటికీలు లేని మశీదులో గడిపినాడు.

ఒకసారి సాయిబాబా తనకు ఆకలిగా ఉన్నదని, లక్ష్మీబాయి షిండేచేత రొట్టెలు చేసి తెప్పించుకున్నాడు.

ఆ రొట్టెలను ఆకలిలోనున్న తాను తినకుండా, ఆకలిగాఉండే కుక్కకు పెట్టినాడు. కుక్క ఆకలి తీరుట నా ఆకలి తీరుటయే అన్నాడుసాయి.

ఇది జ్ఞానులు చూపే పధము. సాయిబాబావలె భక్తిమార్గాన్ని చాటిన మహనీయులెందరో ఉన్నారు. వారిలో కోటంరాజు నాగేశ్వర రావ్ఞగారు ఒకరు.

కోటంరాజువారి జీవితములో ఒకటి రెండు సంఘటలు పరిశీలిస్తే, ఆయన ఎంతటి ఉదాత్తులో విశదమగుతుంది.

కోటంరాజు నాగేశ్వరరావుగారికి భక్తులెందరో ఉన్నారు. శిష్యులెందరో ఉన్నారు. వారందరుకోటంరాజు గారికి ఏ సేవచేద్దామా అని ఎదురుచూచుచుండేవారు.

కోటంరాజు నాగేశ్వరరావుగారు వివాహితులు, ఆయన భార్య గర్భవతి అయినది. భట్టిప్రోలు గ్రామము నందలి కొందరు భక్తులు బరములను, ఆయన భార్యకు పంపదలచారు.

వాటిని ఒక బ్రాహ్మణునికిచ్చి, వారి ఇంటకిి పంపే ఏర్పాటు చేశారు. రేపల్లెలో నుండు కోటంరాజు గారి ఇంటికి బయలుదేరాడా బ్రాహ్మణుడు.

మధ్య మార్గములో ఆ బ్రాహ్మణుని చూశాడు కోటంరాజు గారు. అవి ఏమిటని అడిగాడు కోటంరాజు. ‘మీయింటికే, మీ భార్యకు భట్టిప్రోలు నుండి తెస్తున్నాను ‘అన్నాడు బ్రాహ్మణుడు.

సరే తానే బట్టలను తీసుకుని బయలుదేరారు నాగేశ్వరరావుగారు.

శిరస్సుపై ఆ బట్టలనుంచుకొని, తన ఆరాధ్య దైవమయిన రాముల వారి కీర్తనలు పాడుచూపోతున్నారాయన.

దారిలో ఒక చెట్టు కింద ఒక భాల్లమహిళ జీర్ణవస్తముతో కన్పించింది. ఆమెకు సరిఅయిన బట్టలులేవని కోటంరాజు నాగేశ్వరావుగారు గ్రహించారు.

వెంటనే సోదరవాత్సల్యముతో ఆమెకు చీరె ఇచ్చారు. తాము పంపిన చీనాంబరాలను కోటంరాజువారు, ఒక నిరుపేదస్త్రీకి ఇవ్వటం, భట్టిప్రోలు భక్తులకు తెలిసింది.

ఆ భట్టిప్రోలు భక్తులు, కోటంరాజు వారి మనస్సుబాగా తెలిసినవారు.

వారు ఏ మాత్రము కోపగించక, మరోసారి కోటంరాజువారి భార్యకు పంపారు మరి కొన్ని నూతన వస్త్రాలను కోటంరాజు గారి నోటి వెంట వచ్చేది రామనామమే.

కోటం రాజుగారి తండ్రి పతిదినం సంస్కృతము లోనున్న ఆధ్యాత్మ రామాయణ పారాయణ చేసేవాడు.

ఒకనాడు ఆఆధ్యాత్మిక రామాయణ గ్రంధం స్థానంలోలేదు.తండ్రి నాగేశ్వర రావును అడిగారు పుస్తకమును గూర్చి. ‘

అవును నేనుతీసాను. ప్రతి రోజు తీసి, దానిని తెలుగులో తర్జుమాచేసి యథాస్థానంలో పెట్టేవాడిని.

ఈ రోజు నీవు కొంచెం తొందరగా ఆగ్రంధము కొరకు వచ్చాను. అందకనే నేను యధాస్థానంలో పెట్టలేకపోయాను. అన్నడు తండ్రితో. ఏది? నీ ఉవాదం చూపు అడిగాడు తండ్రి.

కొడుకు కోటంరాజు నాగేశ్వరరావ్ఞ తెచ్చిచూపాడు. తండ్రి చదివాడు సంతసించాడు. మిగిలిన గ్రంథాన్ని తర్జుమా చేయి అని దీవించాడు.

కోటంరాజు నాగేశ్వరరావుగారు భక్తిమార్గానే బోధించినా ఇతర మార్గాలను ఆచరణలో చూపాడు. ప్రతిమార్గము దైవ సన్నిధికే కదా!

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/