రాములవారి కళ్యాణానికి ఎన్నికలు అడ్డు..

రేపు (ఏప్రిల్ 17) సీతారాముల వారి కళ్యాణం. ఈ వేడుక కోసం అన్ని రామాలయాలు సిద్ధం అయ్యాయి. అలాగే ఈ కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ లో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం లో సీతారాముల కళ్యాణం కన్నులపండుగగా జరుగుతుంటుంది. ఇక ఈ ఏడాది కూడా అన్ని హంగులతో ముస్తాబైంది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలం కు చేరుకుంటున్నారు.

అయితే ఈ కల్యాణ మహోత్సవాన్ని లైవ్ ప్రసారం చేయాలనీ ముందుగా అనుకున్నారు. కానీ దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కొనసాగుతున్న వేళ లైవ్ ప్రసారం చేయకూడని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటె ఖమ్మం నుండి భద్రాచలం కు ఆర్టీసీ అదనపు బస్సులను సిద్ధం చేసింది. నేటి నుంచి ఈనెల18 వరకు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల నుంచి 238 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు రీజియన్ మేనేజర్ సీహెచ్.వెంకన్న తెలిపారు.