మెషీన్‌తో సులభంగా వంట

వంటింటి చిట్కాలు

Easy cooking with machine
Easy cooking with machine

మహిళలు ఎంత బిజీగా ఉన్నా వారిపైనెన్ని అదనపు బాధ్యతలున్నా రోజువారీ పనులు తప్పనేతప్పవ్ఞ. ఏ రోజుకారోజు ఉదయాన్నే లేచి, వేళకింత వండివార్చా ల్సిందే.

అందుకే ఈ మేకర్‌. ఇందులో రెండు పాత్రలు ఉండటం వల్ల దానిలో రైస్‌ఐటమ్‌. మరోదానిలో కర్రీ లేదా ఒకదానిలో జొన్నకండెల సోస్‌, మరోదానిలో పాస్తా ఇలా ఒకే సమయం లో సిద్ధం చేసుకోవచ్చు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, రొయ్యలు, గుడ్లు కూరగాయలు, ఆకుకూరలు, జొన్నకండెలు వంటివెన్నో ఉడికించుకోవచ్చు.

అత్యాధిక టెక్నాలజీతో రూపొందిన ఈ మేకర్‌లో 30శాతం వంట వేగంగా అయిపోతుంది. రెండు పాత్రలకు వేరువేరుగా అటాచ్‌ అయి ఉన్న మూతలు క్లోజ్‌ చేసుకుంటే మాత్రం మేకర్‌ మొత్తం ఒకే భాగంలా కనిపిస్తుంది.

మూతలు వేరువేరుగా ఉండటం వల్ల అవ సరాన్ని బట్టి ఒకవైపు మూతపెట్టుకుని, మరోదాన్ని ఖాళీగా వదులుకోవచ్చు. అందుకు వీలుగా ఆప్షన్స్‌ ఉన్నాయి

. టైమ్‌ వంటి ఆప్షన్స్‌ కనిపించేందుకు మేకర్‌ పైభాగంలో మూతకు ముందువైపు డిస్‌ప్లే ఉంటుంది. దానిలో వంట పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుంది.

ఎంత టెంపరేచర్‌లో ఉడుకుతుంది. వంటివి కనిపిస్తా యి. మేకర్‌ ముం దు భాగంలో ఉన్న రెగ్యులేటర్‌ టెంప రేచర్‌ సెట్‌ చేసుకో వడానికి సహకరి స్తుంది.

మేకర్‌పైన ఉన్న డిస్‌పేఏ్లకి కుడి వైపు సెట్టింగ్‌ బటన్‌, ఎడమవైపు మెనూ బటన్‌ ఉంటాయి. వాటిని ప్రెస్‌ చేయగానే ఆప్షన్స్‌ డిస్‌ప్లేలో కనిపి స్తాయి.

ఇక ఈ మెషిన్‌ని క్లీన్‌ చేయడం చాలా ఈజీ, టకటకా పనులు సాగాలంటే ఈ బిజిలైఫ్‌కి ఇలాంటి మెషిన్‌ ఉండాల్సిందే మరి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/