బుద్ధి, శక్తి నొసగుమా..

ఆధ్యాత్మికం: షిర్డీ సాయి మహిమలు

Shirdi Sai Feet- The Way to Salvation
Shirdi Sai Feet- The Way to Salvation

శ్రీమతి బాపత్ సాయి బాబాను సందర్శించింది.. 8 అణాలు దక్షణగా సమర్పించాలనుకుంది.. ఆవిడ వద్ద డబ్బు ఉంది.. మనసు మార్చుకున్నది. 8 అణాలు ఎందుకులే, 4 అణాలు చాలు అనుకున్నది.. సాయి కి 4 అణాలు ఇచ్చింది. సాయి ఆమెతో ‘ మిగిలిన 4 అణాలు ఇవ్వక ఎందుకీ పేద బ్రాహ్మణుడిని మోసగిస్తావు? అన్నారు.. ఆమె తన తప్పుకు సిగ్గుపడి మరో 4 అణాలు సమర్పించింది. ధనం లేని సమయంలో, సాయికి గాలి ఎవరికి గానీ దక్షణ గానీ, ధన సహాయం చేద్దామని పిస్తుంది.. కానీ, శక్తి ఉండదు.. డబ్బు ఇవ్వటానికి శక్తి ఉన్నపుడు, ఇచ్చే బుద్ధి ఉండదు… (మనసు అంగీకరించదు) బాలా సాహెబ్ భాటే కుమార్తె జానకీ బాయి తంప్లె , ఆమె భర్త మరణించాడు.. ఆస్తికి వారసురాలు అయింది..

ఆమె తండ్రి ( ఆమె వివాహమునకు పూర్వము) షిర్డీ కి చేరాడు.. సాయిని దర్శించాడు… ఇక ఉద్యోగం కూడా చేద్దామనిపించలేదు భాటే కు.. జానకీ బాయి తంప్లె కు దానం వచ్చింది.. తండ్రి భక్తిని చూసింది.. సాయి మహత్తు ఆమెకు అవగతమే… ఆమెకు ఉన్న స్థిర చరాస్థులన్నీ సాయి సంస్థానానికి రాసి ఇచ్చింది… అది జనవరి 2 వ తారీకు 1943.. ఆమె కంటే చాల ముందు రాధాకృష్ణ బాయి సాయి సంస్థానాన్ని నెలకొల్పింది.. ఎంతో సేవ చేసింది.. హారతులు , చావడి ఉత్సవం ఆ మహనీయురాలి రూప కల్పనలే ..

రాధా కృష్ణ భాయి తనువు చాలించింది.. ఆమె మరణానంతరం ఆమె లేని లోటును తీర్చినది జానకీ భాయి తంప్లె .. ధనాన్ని సాయి పరం చేయటం ఒక మినహాయింపు.. మరో విశేషం కూడా ఉన్నది.. ఆమె సంస్థాన భోజన గృహాన్ని అత్యంత సమర్ధవంతంగా నడిపించింది.. దానినే సాయినాథుని సేవా మందిరంగా మార్చింది.. ఆమె ఆరోగ్యంగా లేకున్నా, తన శరీరాన్ని సాయి భక్తుల కొరకు అరగదీసింది.. వారిని ఆదర్శంగా తీసుకుని అందరూ ఏ కొంచంగా నైనా ఆచరించి చూపిస్తే చాలు, అదే పది వేలు. అప్పుడే మనకు సాయి ఆశీస్సులు లభిస్తాయి.. సాయి చెప్పినట్టు మనకున్న దానిలో కొంతైనా ఇతరులకు పంచి వారిని సంతోషపరిస్తే సాయి మనసు సంతోషపరుస్తాడు..
బుద్ధి నొసగుమా! శక్తి నొసగుమా!

  • ఎం.పి . సాయినాథ్

‘చెలి ‘ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/women/