మాతృస్వరూపులు

ఆధ్యాత్మిక చింతన

Shirdi sai baba
Shirdi sai baba

ముఖ్యాంశాలు

  • మహనీయులు అంతే.. వారు అందరికీ మాతృస్వరూపులే
  • ఆ మహిళను సాయి తల్లిగా సంబోధించారు
  • సుబ్బారాయుడు, కొణిజేటి రంగనాయకమ్మ దంపతులు
  • తెలుగు గడ్డపై మరో రామకృష్ణ పరమహంస,శారదలా ఖ్యాతి

సాయిబాబా తనకు ఉపదేశం ఇవ్వలేదని ఒక మహిళ నిరాహార దీక్ష చేస్తోంది. ఆ విషయాన్ని శ్యామా అని పిలవబే ఒక భక్తుడు సాయికి చెప్పాడు.

సాయిబాబా ఆ మహిళను పిలిపించి ‘ ఓ తల్లీ! అనవసరమైన శిక్షలకు ఏ పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను నాయందు కనికరించి నేను చెప్పునది వినుము..

అంటూ ఒక గాథను చెప్పాడు. ఆ మహిళ సాయిబాబాకు భక్తురాలు, ఇక ఏవిధమైన బంధుత్వం ఆమెతో లేదు. కానీ ఆమెను సాయి తల్లిగా సంబోధించారు.

మహనీయులంతే! వారికి అందరూ మాతృస్వరూపులే! రామకృష్ణ పరమహంసకు శారదాదేవితో వివాహమయినది. కానీ వారి నడుమ భార్యాభర్త బంధము లేనేలేదు.

ఇక తెలుగుగడ్డపై జన్మించిన సుబ్బారాయుడుగారు, ఆయన భార్య కొణిజేటి రంగనాయకమ్మగారలు భార్యాభర్తలు. కానీ వారు భార్యాభర్తలుగా ప్రవర్తించలేదు. వారే దర్గాబాబా, అమ్మయ్యగారలైనారు.

తెలుగుగడ్డపై మరో రామకృష్ణ పరమహంస, శారదల వలె పేరు తెచ్చుకున్నారు. అలనాటి వంగదేశంలోని బర్ద్వాన్‌ జిల్లాలో కోగ్రామం ఉన్నది.

ఆ కోగ్రామంలో కమలాకరుడు, సర్వానందీదేవీలకు ఒకే ఇక సంతానం కలిగింది. ఆ ఏకైక పుత్రునికి లోచనదాసు అనే పేరు పెట్టుకున్నారు.

చిన్నతనం నుండి లోచనడు ప్రపంచబంధంలో చిక్కుకోలేదు. ఆధ్యాత్మికంగానే ఉండేవాడు.

అప్పటి ఆచారవ్యవహారాలననుసరించి అతనికి బాల్యంలోనే వివాహమయింది. ఆ విషయం ఆ బాలునకు జ్ఞాపకముంది. అత్తవారి ఊరు ఆమోదపురము.

అతని భార్య ఆమోదపురంలోనే తల్లిదండ్రుల వల్ల పెరగసాగింది. లోచనదాసు చైతన్య మహాప్రభు భక్తుడయిన నరహరి ఠాకూరు వద్ద చేరాడు. ఆయన శిష్యుడయ్యాడు.

లోచనుని వైరాగ్యాన్ని తల్లిదండ్రులు గమనిస్తున్నారు.

నరహరి ఠాకూరు దినదినానికి లోచనదాసులో పెరుగుతున్న కృష్ణప్రేమను గమనించేవాడు. లోచనదాసు తలమునకలుగా శ్రీకృష్ణుని ప్రేమించినా, ఆతడు సంసార విముఖుడు కాడు.

లోచనదాసు భార్య ఒక కాపురమునకు వచ్చు వయస్సు వచ్చినది.

లోచనదాసుని ఆమోదపురంలో ఉన్న అత్తవారింటికి రమ్మని, ముందుగా లోచనదాసు తల్లిదండ్రులు ఆమోదపురం వెళ్లారు.

ఆమోదపురం పోవటానికి తన గురువైన నరహరి రాకూరుని అనుమతి పొంది ఆమోదపురం బయలుదేరాడు లోచనుడు. ఆమోదపురం చేరాడు.

బాల్యంలో చూచిన అత్తగారిల్లును గుర్తుపట్టలేకపోయాడు. దారిలో కనిపించిన ఒక మహిళను ‘అమ్మా అని పిలిచి ఫలానావారిల్లు ఎక్కడ అని అడిగాడు.

ఆ మహిళ ఆ ఇంటి గుర్తులు చెప్పి, వెళ్లిపోయింది. కొంచెం సేపటికి లోచనదాసు అత్తవారిల్లు గుర్తుపట్టి చేరాడు. లోచనునకు శోభనం చేయ నిశ్చయించారు పెద్దలు.

తనను అమ్మ అని సంబోధించిననది తన భర్త అని లోచనుని భార్య గ్రహించి తాను అమ్మ అని సంబోధించినది తన భార్యనేనని లోచనుడు గ్రహించాడు.

అమ్మ అనే పదమునకు ఉన్న విలువ ఆ ఇద్దరకూ తెలుసు. అగ్నిని తెలిసి తాకినా, తెలియక తాకినా చేయి కాలుతుంది.

వారిద్దరు ఈ విషయాన్ని తమ తమ తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు అంగీకరించారు.

లోచనుడు తన భార్యను మాతృమూర్తిగా భావించి సాష్టాంగ నమస్కారం చేశాడు. లోచనదాసు వంగభాషలో మృదుమధురంగా ‘చైతన్య మంగళను రచించాడు.’ మాతృదేవోభవ.

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/