రాజద్రోహం చట్టం..సుప్రీంకోర్టు నిర్ణయాన్నిస్వాగతిస్తున్నాను

ఈ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయ‌కూడ‌ద‌ని కోర్టు చెప్పింద‌ని వ్యాఖ్య‌


అమరావతి: రాజద్రోహం చట్టాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు నిన్న‌ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఈ రోజు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ”రాజద్రోహం చట్టం 124 ఏ అమలును నిలిపివేస్తూ, దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సెక్షన్‌ కింద ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు చేయ‌కూడ‌ద‌ని చెప్పడంతో పాటు, ఇప్పటికే పెట్టిన కేసులపై తదుపరి చర్యలు వద్దని స్పష్టం చేయడం హర్షణీయం.

నియంతృత్వ పోకడలు అనుసరించే ప్రభుత్వాలు తమ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్న ఈ తరుణంలో… ప్రజా హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దోహదం చేస్తుంది” అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/