యాసంగి వడ్లు కొంటామన్న మాటను కేసీఆర్ నిలుపుకోవాలి

ఇప్పటి వరకు 17 శాతం వడ్లు మాత్రమే కొన్నారని షర్మిల విమర్శ

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. యాసంగి వడ్లు కొంటామని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు కేవలం 17 శాతం వడ్లు మాత్రమే కొన్నారని విమర్శించారు. వడ్లు తడిసిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే… కేసీఆర్ కు చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు.

ఆదుకుంటానని చెప్పిన దొరగారు వడ్లు కొనని పుణ్యానికి రైతులకు ఎకరాకు రూ. 10 వేల నష్టం వస్తోందని ఆమె విమర్శించారు. రైతన్నను ఆదుకునేది ఎవరని ప్రశ్నించారు. కళ్లాల్లోని వడ్లు వర్షాలకు తడిసిపోతే రైతు కన్నీరు తుడిచేదెవరని అడిగారు. గొప్పలు చెప్పుకోవడానికే వడ్లు కొంటామని చెప్పినట్టున్నారని అన్నారు. 7 వేల కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు రూ. 500 ఎక్కువిచ్చి కొంటామన్న కేసీఆర్ మాటలు ఎక్కడకు పోయాయని షర్మిల మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/