మోడీ కామెంట్స్ కు శశిథరూర్ కౌంటర్

లోక్ సభ లో ప్రధాని మోడీ..కాంగ్రెస్ పార్టీ ఫై నెహ్రు కుటుంబం ఫై చేసిన కామెంట్స్ ఫై congres సీనియర్ నేత శశిథరూర్ కౌంటర్ ఇచ్చారు.

పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మారలేదు అన్నారు. కుటుంబ పాలనతో దేశం ఎంత నష్టపోయిందని.. కాంగ్రెస్‌ నాయకులు కూడా అంతే నష్టపోయారన్నారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారని.. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరని. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్‌ చేస్తోందని మోడీ చెప్పుకొచ్చారు.

పార్లమెంట్‌లో మోడీ చేసిన ప్రసంగాన్ని.. విపక్షాలపై చేసిన విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఖండించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ చనిపోయి చాలా ఏళ్లు అయినా వారి గురించి ప్రస్తావించడం దురదృష్టకరమన్నారు. గాంధీ కుటుంబంపై ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను చూసి మోడీ భయపడినట్లుగా ఉన్నారు.. అందుకే మోడీ ప్రసంగమంతా కాంగ్రెస్ గురించే ఉందన్నారు.