కరోనా చికిత్స, టీకాలకు ‘ఆధార్’ తప్పనిసరి కాదు

కేంద్ర ప్రభుత్వ సంస్థ (UIDAI) వెల్లడి

'Aadhaar' is not mandatory for corona treatment and vaccines
‘Aadhaar’ is not mandatory for corona treatment and vaccines

New Delhi: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా చికిత్స, టీకాలు పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పేర్కొంది. ఆధార్ లేదనే కారణంతో వైద్యశాలల్లో కరోనా బాధితులను చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం వంటివి ఇకపై చేయకూడదని పేర్కొంది. ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందవచ్చని పేర్కొంది. టీకా నమోదుకు కావాల్సిన ఫోటోగుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు లేకపోతే ఉపయోగించగల అనేక ఇతర పత్రాలు ఉన్నాయని తెలిపింది. టీకా నమోదుకు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్డు, పెన్షన్ పత్రాలు కూడా చెల్లుతాయని., ఈ మేరకు వాటిలో ఏదైనా పత్రాన్ని చూపించి కరోనా చికిత్స, కరోనా వాక్సిన్ పొందవచ్చని సూచిందింది.