తెలంగాణ నుంచి పోటీ చేయండి -సోనియా కు రేవంత్‌రెడ్డి రిక్వెస్ట్

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీకి ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కోరుతూ ఇప్ప‌టికే పీసీసీ తీర్మానించిన విష‌యాన్ని ఆయ‌న సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రేవంత్‌, భట్టి.. సోనియాను కలవడం ఇదే తొలిసారి.

ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన, అమలు చేస్తోన్న పథకాల గురించి ఆమెకు వివరించారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇక, దీనిపై స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.