ఇయర్‌ రింగ్స్‌ ఎంపిక

ఫ్యాషన్ ఫ్యాషన్

Ear Rings
Ear Rings

గుండ్రటి ముఖం:

పొడవాటి లేదా కోలగా ఉండే ఇయర్‌ హ్యాంగింగ్స్‌ ,ఇయర్‌ రింగ్స్‌ ఈ ముఖాకృతికి సూటవుతాయి. ఇందుకోసం టియర్‌డ్రాప్‌, డ్యాంగ్లర్లు ఎంచుకుని, గుండ్రంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి.

కోల ముఖం:

ఈ ముఖాకృతికి ఎలాంటి ఇయర్‌ రింగ్స్‌ అయినా సూటవుతాయి. కాబట్టి టియర్‌డ్రాప్‌ లేదా సట్డ్స్‌ ఎంచుకోవచ్చు. డ్యాంగిల్స్‌, టియర్‌డ్రాప్స్‌, షాండ్లియర్‌ ఇయర్‌ రింగ్స్‌ నప్పుతాయి.

నలు చదరపు ముఖం:

ఈ ముఖాకృతి సమంగా కనిపించడం కోసం గుండ్రటి ఇయర్‌ రింగ్స్‌ ఎంచుకోవాలి. ఇయర్‌ హ్యాంగింగ్స్‌, డ్యాంగ్లింగ్స్‌, ఇయర్‌ హూప్స్‌ బాగుంటాయి.

వజ్రాకృతి ముఖం:

డ్యాంగిల్‌, హూప్‌ ఇయర్‌ రింగ్స్‌ ఎంచుకోవాలి. డైమండ్‌ షేప్‌లో ఉండే ఇయర్‌ రింగ్స్‌ ధరించకూడదు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/