ఒత్తిడిని ఇలా జయించండి

జీవన వికాసం

కొవిడ్‌19తో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న లాక్‌డౌన్‌లతో అందరూ ఇండ్లకే పరిమితం కావాల్సివచ్చింది. ఒక్కసారికి ఇంట్లోనే రెండునెలలు ఉండడం కొందరికి ఆనందం అనిపించివుండవచ్చు. మరికొందరికి ఉపాధి అవకాశాలు పోతాయనే చింత, వేదన వెంటాడి ఉండొచ్చు. ఇలాంటి నిరాశనిస్పృహతలతో ఇటీవల ప్రముఖులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నటినటులున్నారు. గృహిణులు, పిల్లలు, పురుషులూ వ్ఞన్నారు. ఇలా ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.
స్పష్టమైన మార్పు: ఆత్మహత్యకు పాల్పడాలని భావించే వారి ప్రవర్తనలో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. బలవన్మరణానికి పాల్పడాలని భావించే వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ సేపు నిద్రపోతుంటారు. చిన్నచిన్న కారణాలకే చికాకు పడుతుంటారు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారి ఆగిపోతుంటారు. వస్త్రధారణ మీద సరిగా శ్రద్ధపెట్టరు.
మానసిక ఒత్తిడి పెనుసమస్య: కాలంతో పరుగులు పెట్టలేక ఓడిపోయిన ప్రతి ఒక్కరూ చనిపోవాలా? అని అంటే అక్కరలేదు. కానీ మానసిక ఒత్తిడితో ఇబ్బందిపడే చాలామంది మాత్రం చనిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచదేశాల్లో మానసిక ఒత్తిడి అనేది పెనుసమస్య. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు తొంభైరెండుశాతం మంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. అందులో డెబ్బై ఒక్కశాతం మంది ఒత్తిడికి మందులు కూడా వాడుతున్నారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుస్తోంది. జీవితంలోని సంఘటనలను అర్థం చేసుకోకపోవడం వల్ల, తమపై తాము ఒత్తిడి పెంచుకోవడం వల్ల సాధారణంగా మనిషి ఒత్తిడికి లోనవ్ఞతాడు. స్వీయ అవగాహనాలోపం వల్ల విపత్కర పరిస్థితులు మనిషిని ఒత్తిడికి గురిచేస్తాయి.
సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి: ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు స్వయంగా సహాయం కోరుకునే అవకాశం లేదు. కాబట్టి తల్లిదండ్రులు, ఇంటి ఆవరణలోని మిత్రులు, పాఠశాల లేదా కాలేజీ ఉపాధ్యాయులు, బంధువ్ఞలు, సహచరులు ఆత్మహత్యకు హెచ్చరిక సూచనలు గ్రహించి ముందుగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. చావ్ఞ ద్వారానే సమస్యకు పరిష్కారం రాదు అనే విషయాన్ని గుర్తింపచేయాలి. జీవిత విలువలను గుర్తింపచేసేవిధంగా ప్రేరణ కల్పించాలి. అభయహస్తం అందించాలి. ఒంటరిగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంభాషణను కొనసాగించేలా చర్యలు ఉండాలి. సైకాలజిస్ట్‌ను కూడా స్నేహితులుగా గుర్తించి తగు సలహాలు సూచనలు తీసుకొనే విధంగా ప్రోత్సహించాలి.
ఒత్తిడిని జయించండిలా:
రోజువారీ భావోద్వేగాలను ఒక పుస్తకంలో రాసుకోవడం వల్ల ఆత్మపరిశీలనకు, విశ్లేషణకు చక్కగా ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వల్ల మానసిక స్థితి మెరుగవ్ఞతుంది. అప్పుడప్పుడూ చిన్నచిన్న విహారయాత్రలకు ఇతర ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండవచ్చు. మానసిక వ్యాకులత కలిగినప్పుడు ప్రపంచం నుండి దూరంగా ఉండకుండా నలుగురితో మెలగాలి. స్నేహితులను కలవాలి. ప్రతి పరిస్థితిని ఎక్కువగా ఊహించుకోవద్దు. పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటంలో తప్పు లేదు. కానీ ముందుగానే ఆ పరిస్థితులను ఊహించుకుని దిగాలుపడటం తప్పు. ఒత్తిడిలోంచి బయటకు రావడానికి అన్నిటికన్నా తేలికైన, ప్రభావవంతమైన మార్గం. సైకాలజిస్ట్‌ ద్వారా కైన్సెలింగ్‌ తీసుకోవడం. దీనివల్ల మానసిక ఒత్తిడికి కారణమైన సమస్య సులువ్ఞగా పరిష్కారమవ్ఞతుంది. గతంలో జరిగిన పొరపాట్ల గుర్తించి, భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించి ఆలోచించడం వృధా. అందుకే ఈ రోజు గురించి ఆలోచించండి. ప్రతికూలతలు పోయి అనుకూలమైన ఆలోచనలు రావడానికి సరైన విశ్రాంతి అవసరం. అందుకని ప్రతిరోజు ఏడుగంటలు నిద్రపోవాలి.
ఇవి పాటించండి
మిత్రుల ఎంపికలో జాగ్రత్త వహించండి: దూరాలోచనలు చేసేవారికి దూరంగా ఉండాలి. ఇతరుల్ని అణిచేయాలని చూసేవారి పక్కన పొరపాటున కూడా చేరకండి. స్పష్టమైన ఆలోచనలు కలిగినవారు ప్రశాంతమైన మనసుని, వివేకాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయడం మంచిది. మంచి స్నేహితులు ఉంటే మానసిక ఒత్తిడి కలగడం తక్కువ. ఎందుకంటే మానసిక బాధలున్నప్పుడు వారు మంచి శ్రోతగా మారి బాధలన్నింటినీ చక్కగా వింటారు. వారు మనపై చూపించే శ్రద్ధ, సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా మనపై మనకు వ్యక్తిగత అవగాహనను పెంచుకోవడానికి సహాయపడుతుంది.
క్షీణిస్తున్న విలువలు: అత్యవసర పరిస్థితుల్లో తెలియని వ్యక్తులను కూడా సహాయం అడుగుతాం. అలాంటిది జీవితంలోని కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయం అడగాటానికి ఇబ్బందేముంది? ఎవరూ జీవితంలో అన్ని బాధ్యతలనూ ఒంటరిగా తలకెత్తుకోలేరు అందుకని భాగస్వామినుంచో, స్నేహితుడి నుంచో, కుటుంబ సభ్యుల నుంచో, సహోద్యోగుల నుంచి సహాయం తీసుకోవడం తప్పుకాదు.
వ్యాయామం: వ్యాయామం ద్వారా బరువ్ఞ తగ్గడమే కాకుండా శరీరంలో అనుకూలతలు కూడా ఏర్పడతాయి.
వ్యాయామంతో శరీరంలో సెరోటోనిన్‌, టెస్టోస్టిరాన్‌లు విడుదల కావడం వల్ల మనసు నిలకడగా ఉండి నిరుత్సాహపరిచే ఆలోచనలను దూరం చేస్తుంది.

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చిక్కుళ్లు, కార్పొహైడ్రేట్లు వంటివి తీసుకోవడం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది. సమతుల ఆహారం శారీరక శ్రేయస్సును పెంపొందిస్తుంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/