తమిళనాడు తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌

జీవన వికాసం

Veera lakshmi
Veera lakshmi

అంబులెన్స్‌ అంటే ఆఘమేఘాల మీద నడపాలి. లోపల ఉన్న పేషంట్‌ గగ్గోలు పెడుతున్నా బంధువులు కంగారులో రోదిస్తున్నా చెదరక గమ్యాన్ని చేరాలి.

అవసరమైతే ఫస్ట్‌ ఎయిడ్‌ చేయాలి. ఊపిరికి పచ్చదీపం చూపాలి. ఇదంతా మగవారి పని అని అందరూ అనుకుంటారు. కాదన ఇనిరూపిస్తోంది చెన్నై వీరలక్ష్మి.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 118 కొత్త అంబులెన్స్‌లకు పచ్చజెండా ఊపి ప్రజల వైద్యసేవలకు వాటిని అంకితం చేశారు.

రాష్ట్రం వేయికి పైగా ఉన్న అంబులెన్స్‌లకు ఇవి కొత్త చేర్పు. ఇది ఒక విశేషమైతే ఈ కొత్త అంబులెన్స్‌ లలో ఒకదానికి ఒక మహిళా డ్రైవర్‌ను ఆయన అపాయింట్‌ చేయడం మరో విశేషం.

ఆ మహిళ పేరు వీరలక్ష్మి. ఈ నియామకంతో వీరలక్ష్మి. తమిళనాడు తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌ అయ్యింది. బహుశా భారత దేశంలో ఈ కోవిడ్‌ కాలలో డ్యూటీలో ఉన్న ఏకైక మహిళా డ్రైవర్‌ కూడా కావచ్చు.

చెన్నూలో నివాసం ఉండే 30 ఏళ్ల వీరలక్షి ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసింది.

క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆరేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో డ్రైవింగ్‌ నేర్చుకుంది. అప్పఇ నుంచి తనూ క్యాబ్‌ డ్రైవర్‌గా మారి పనిచేయడం మొదలెట్టింది.

అంతే కాదు డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకునే మహిళలకు శిక్షకురాలిగా కూడా మారింది. హెవీ వెహికిల్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సంపాదించింది.

అయితే కరోనా అందరికీ తెచ్చినట్టే వారి కుటుంబానికి ఇబ్బందులను తెచ్చింది. భర్తకు తగినంత పని లేదు.

తనకు కూడా లేదు. ఈ సయంలోనే కొత్త అంబులెన్స్‌ డ్రైవర్ల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి.

కాని అంబెలెన్స్‌ డ్రైవర్‌గా ఇప్పటి వరకూ స్త్రీలెవరూ పనిచేయలేదు. ఏం చేద్దామను కుంటూ ఉంటే మా అమ్మ ధైర్యమం చెప్పింది.

గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఉండదు అని చెప్పింది. అంది వీరలక్ష్మి. అపాయింట్‌మంట్‌ వచ్చాక కొన్నాళ్లు అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఉండటానికి అవసరమైన ట్రైవింగ్‌ ఇచ్చారు. ప్రాక్టికల్‌ అనుభవం కోసం అంబులెన్‌ డ్రైవర్‌లతో పాటు పంపారు.

‘నాకు పాసింజర్లను కూచోబెట్టుకుని క్యాబ్‌ నడపడమే తెలుసు. కాని అంబులెన్స్‌లో ప్రయాణికులతో పాటు చాలాసార్లు రక్త కూడా ఉంటుది.

ముందు భయం వేసినా తర్వాత అలవాటైంది. 108 అంబులెన్స్‌ అంటే కోవిడ్‌ పేషెంట్స్‌ను కూడా తీసుకురావల్సి రావచ్చు.

కాని మా జాగ్రత్తలు మాకున్నాయి అన్న ధైర్యం ఉంది. ఇటువంటి సమయంలో అవసరమైన ఆరికి ఏవ చేయబోతున్నానన్న సంతృప్తి కూడా ఉంది అంది వీరలక్ష్మి.

ఆమె మొదటిసారి యూనిపామ్‌ వేసుకొని అన్ని అంబులెన్స్‌లతో పాటు నడుపుతుంటే చూడటానికి తండ్రితోపాటు వచ్చిన పదేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు తమ తల్లివైపు గర్వంగా, ఆశ్చర్యంగా చూసే వారు.

శక్తి సామర్థ్యాలను చూపి, పాత మూసలు పగులగొట్టే వీరలక్ష్మి వంటి ఆరిని ఎవరైనా అలాగే చూడాల్సిందే.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/