కరోనా కాలంలో కంటి చికిత్స!

నేత్రాల సంరక్షణ

Eye treatment during the corona period
Eye treatment during the corona period

కళ్ల ద్వారా కూడా కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే వీలుంది.

కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు కరోనా సోకు తుందనే భయంతో కంటి వైద్యులను కలవడానికి వెనుకాడకూడదు.

కొన్ని కంటి సమస్యలు కరోఆ కంటే తీవ్రమైన నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. కాబట్టి సకాలంలో కంటి చికిత్సలను ఆశ్రయించాలి.

డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌ :

వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఉద్యోగులు, ఆన్‌లైన్‌ క్లాసులతో విద్యార్థులు ఎక్కువ సమయాల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోయే పరిస్థితి. ఇలా అధిక సమయాల పాటు స్క్రీన్‌ల మీద దృష్టి నిలపడం మూలంగా కళ్లు అలసటకు గురవడం, పొడిబారడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇలాంటప్పుడు టెలికన్లఏ్టషన్‌ ద్వారా కంటి వైద్యులకు సమస్యను వివరించి, సలహాలు పొందాలి. దృష్టి లోపాలు, పవర్‌ కరెక్షన్‌ అవసరమైన వాళ్లు ఆస్పత్రికి వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలి.

కళ్లజోడు:

ముఖానికి మాస్క్‌ ధరించినప్పుడు, వదిలే ఊపిరితో కళ్లద్దాలు మసకబారిపోయే సమస్య కళ్లజోడు ధరించే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేదే! ఈ సమస్య ఉన్నవాళ్లు యాటీపాగ్‌ కోటింగ్‌ కళ్లద్దాలు ఎంచుకోవాలి.

కాంటాక్ట్‌ లెన్సులు :

కరోనా ప్రారంభంలో కాంటాక్ట్‌ లెన్స్‌ల వాడకానికి అభ్యంతరాలు ఎదురయ్యాయి. అయితే తగు జాగ్రత్తలు పాటిస్తూ, పరిశుభ్రతతో నడుకుంటే కరోనా సోకుతుందనే భయం లేకుండా కాంటాక్ట్‌ లెన్స్‌లను వాడుకోవచ్చు.

కరోనా లాంటి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌లే కాదు. ఎటుంటి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌లనూనా దూరం పెట్టాలంటే పరిశుభ్రత విషయంలో రాజీపడకుండా ఉండాలి.

క్యాటరాక్ట్‌:

శుక్లాల సమస్య అత్యవసర చికిత్స కాదు. అయితే కళ్లమీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి, కంటిచూపు కోల్పోయే పరిస్థితి ఉన్నప్పుడు సర్జరీ అత్యవసరం అవుతుంది. అయితే అంతకంటే ముందుగానే క్యాటరాక్ట్‌ సర్జరీ చేయించుకుంటే నాణ్యమైన చూపు దక్కించుకోవచ్చు. అయితే
పిల్లల్లో కంటి శుక్లాలకు అత్యవసరంగా చికిత్స చేయించకపోతే లేజీ ఐ సమస్య తలెత్తుతుంది.

రెటీనా డిజార్డర్లు :

మధుమేహులు తప్పనిసరిగా క్రమం తప్పకుండా రెటీనా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మదుమేహుల్లో స్ట్రోక్‌, కళ్లలో రక్తస్రావం మూలంగా హఠాత్తుగా కంటిచూఉ కోల్పోయే ప్రమాదం ఉంది లేజర్లు, ఇంజెక్షన్లు, రెటీనా సర్జరీల అవసరమున్న వారు వైద్యులను కలిసి చికిత్స తీసుకోవడం ఆలస్యం చేయకూడద. ఈ సమస్యలను ఆలస్యం చేస్తే వాటి మూలంగా తగ్గిపోయే కంటిచూపును సరిదిద్దే వీలుండదు.

గ్లాకోమా:

గ్లాకోమాకు సకాలంలో చికిత్స చేయకపోతే శాశ్వత అంధత్వం తప్పదు. చికిత్స ఆలస్యమైతే ఆప్టిక్‌ నర్వ్‌ సరిదిద్దలేనంగా దెబ్బతిని శాశ్వతంగా చూపు పోతుంది. కాబట్టి గ్లాకోమా రోగులు తప్పనిసరగా వైద్యుల పర్యవేక్షణలో అవసరానికి తగిన చికిత్స తీసుకోవాలి.

లేజర్‌ విజన్‌ కరెక్షన్‌:

కళ్లజోడు, కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడే అవసం లేకుండా చక్కని దృష్టిని పొదడానికి తోడ్పడే లేజర్‌ విజన్‌ కరెక్షన్‌ సర్జరీల కోసం కొత్త మార్గదర్శకాలను వైదుల్యలు అనుసరిస్తున్నారు. కాబట్టి నిర్భయంగా ఈ సర్జరీలను ఆశ్రయించవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/