సెబీ చేతికి పాన్‌కార్డు వివరాలు
అక్రమాలకు పాల్పడే మోసగాళ్లు ఇక ఆలోచించాల్సిందే!

న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడే మోసగాళ్లు ఇక ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. అక్రమాలకు పాల్పడి బిచాణా ఎత్తివేసినా వారి పాన్ నంబరు, ఆదాయ పన్ను రిటర్న్, బ్యాంక్ ఖాతాతో సహా వ్యక్తిగత వివరాలన్నీ సెబీకి తెలిసి పోతాయి. ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నుంచి ఈ వివరాలు సెబీకి అందబోతున్నాయి. ఐటీ శాఖ నుంచి సెబీకి ఈ వివరాలు అందజేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై రెండు సంస్థలు త్వరలో సంతకాలు చేయబోతున్నాయి. అయితే ఈ సమాచార మార్పిడి కోసం అనుసరించాల్సిన విధి విధానాలు, ఆ సమాచారం బయటికి పొక్కకుండా సెబీ తీసుకోవలసిన జాగ్రత్తలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/