రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందిః పవన్

Seats were sent keeping in mind the future of the state: Pawan

అమరావతిః ప్రధాని నరేంద్ర మోడీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఏపీలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేనలు కలిసి పని చేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందని అన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని మూడు పార్టీలు దృఢ సంకల్పంతో ముందడుగు వేశాయని చెప్పారు.

ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందనేది తమ ప్రగాఢ విశ్వాసమని అన్నారు. ఎన్డీయే భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని చెప్పారు. చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు జయంత్ పాండా, టిడిపిఅధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.